Bheemla Nayak: 'భీమ్లా నాయక్' సినిమా టికెట్లు అమ్మలేదంటూ అభిమానుల ఆగ్రహం.. తాడిపత్రిలోని థియేటర్ వద్ద ఉద్రిక్తత!

Tension near Bheemal Nayak movie theatre in Tadipathri
  • ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భీమ్లా నాయక్'
  • ఏపీలో కొన్ని చోట్ల సినిమాకు అడ్డంకులు
  • ఆందోళనకు దిగుతున్న పవన్ అభిమానులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన 'భీమ్లా నాయక్' చిత్రం ఈరోజు విడుదలయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ పవన్ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణలో రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతించింది.

మరోవైపు ఏపీలో మాత్రం పలు చోట్ల సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఎస్ఎల్ఎన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. థియేటర్ యాజమాన్యం టికెట్లు ఇవ్వకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News