ఝార్ఖండ్ లో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు
- ప్రమాద సమయంలో పడవలో 18 మంది
- నలుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
- బార్బెండియా వంతెన వద్ద ప్రమాదం
ఝార్ఖండ్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధన్ బాద్లోని నిర్సా నుంచి జమ్తరకు వెళుతుండగా.. బార్బెండియా వంతెన వద్ద పడవ బోల్తా కొట్టింది. ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. నలుగురు బాధితులను కాపాడారు. మిగిలిన 14 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.