Indian Students: కీవ్ లోని భారత ఎంబసీకి పోటెత్తిన విద్యార్థులు... వీడియో ఇదిగో!

Indian students reached Indian Embassy in Kyiv
  • ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు
  • యుద్ధం నేపథ్యంలో గగనతలం మూసేసిన ఉక్రెయిన్
  • విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన భారత ఎంబసీ

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో, అక్కడి భారత విద్యార్థులు తీవ్ర ఇబ్బందికర వాతావరణంలో చిక్కుకున్నారు. ఓవైపు ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో భారత్ నుంచి కీవ్ ఎయిర్ పోర్టుకు విమానాలు రావాలన్నా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కీవ్ లోని భారత ఎంబసీ ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది.

రష్యా నేడు యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో, ఉక్రెయిన్ లోని వివిధ మెడికల్ యూనివర్సిటీల్లో వైద్య విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులు భారత దౌత్య కార్యాలయానికి భారీగా తరలి వచ్చారు. దాదాపు 200 మంది విద్యార్థులకు ఎంబసీ అధికారులు బస ఏర్పాటు చేశారు. అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించారు. ఉక్రెయిన్ లో భారత రాయబారి ఆ విద్యార్థులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. పరిస్థితి చక్కబడే వరకు దౌత్య కార్యాలయం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ లోని భారత దౌత్య కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Loading...

More Telugu News