Teja: 'విక్రమాదిత్య'లో హీరోగా తేజ తనయుడి ఎంట్రీ?

Amithav in Teja movie
  • తేజ తాజా చిత్రంగా 'అహింస'
  • హీరోగా అభిరామ్ పరిచయం 
  • నెక్స్ట్ ప్రాజెక్టుగా 'విక్రమాదిత్య'
  • త్వరలోనే సెట్స్ పైకి  
తేజ దర్శకుడిగా తన కెరియర్ ఆరంభంలో ప్రేమకథా చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ వచ్చాడు. ఆ తరువాత తన రూట్ మార్చుతూ విభిన్నమైన కథా చిత్రాలతో కొన్ని ప్రయోగాలు చేశాడు. 'నేనే రాజు నేనే మంత్రి' వంటి కథల క్లైమాక్స్ విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు.

ఆ తరువాత ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపాన్ని దాల్చలేదు. ఆయన తాజా చిత్రంగా 'అహింస' రూపొందుతోంది. రానా సోదరుడు 'అభిరామ్' ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజ బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

'విక్రమాదిత్య' అనే టైటిల్ తో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెప్పారు. 18వ శతాబ్దం నేపథ్యంలో కథ నడుస్తుందని చెప్పారే తప్ప, హీరో ఎవరనేది ప్రకటించలేదు. ఈ సినిమాతో తేజ తనయుడు 'అమితవ్' హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలోనే అతని పోస్టర్ వదులుతారని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి!
Teja
Amithav
Vikramadithya Movie

More Telugu News