Russia: ఉక్రెయిన్ పై మూడు దిక్కుల నుంచి దాడులు..ఒక్క దిక్కే శ‌ర‌ణ్యం!

Russian lightning strikes on Ukraine from three directions
  • ఉక్రెయిన్‌పై ర‌ష్యా మిలిటరీ ఆప‌రేష‌న్‌
  • తూర్పు, ఉత్త‌ర‌, ద‌క్షిణ దిక్కుల నుంచి ర‌ష్యా దాడులు
  • ప‌డ‌మ‌ర వైపుగా ప‌రుగులు పెడుతున్న జ‌నం
గురువారం ఉద‌యం నుంచి ఉక్రెయిన్‌పైకి మిలిట‌రీ ఆప‌రేష‌న్ అంటూ దాడుల‌కు దిగిన ర‌ష్యా ఉక్రెయిన్‌ను చుట్టేస్తోంది. ఉక్రెయిన్‌పై మూడు దిక్కుల నుంచి రష్యా మెరుపు దాడుల‌కు దిగుతోంది. తూర్పు, ఉత్త‌ర‌, ద‌క్షిణ దిక్కుల నుంచి ఉక్రెయిన్‌పై ర‌ష్యా విరుచుకుప‌డుతోంది. దీంతో ఉక్రెయిన్ వాసుల‌తో పాటు ఆ దేశంలో ఉంటున్న ఇత‌ర దేశ‌స్తులు కూడా ర‌ష్యా దాడులు లేని నాలుగో దిక్కైన ప‌డ‌మ‌ర వైపుగా ప‌రుగులు పెడుతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు అంత‌ర్జాతీయ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి.
Russia
Ukraine

More Telugu News