Parthasarathi: పోలీసులను బ్రోకర్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి

YSRCP MLA Parthasarathi fires on police
  • ఉయ్యూరు టౌన్ పోలీసులపై దుర్భాషలాడిన పార్థసారథి
  • ఎస్ఐ పై కేసులు పెట్టాలని పార్టీ శ్రేణులకు చెప్పిన వైనం
  • ఎస్ఐ, ఏఎస్ లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు
కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి విరుచుకుపడ్డారు. పోలీసులు బ్రోకర్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్ఐపై కేసులు పెట్టాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. ఎస్ఐ, ఏఎస్ఐ లపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.

ఏఎస్ఐ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉండకూడదని, అతనిపై చర్యలు తీసుకోకపోతే హోమ్ మినిస్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గొడవ పడిన నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణలను పోలీసులు కొట్టారనే ఆగ్రహంతో వారిపై పార్థసారథి మండిపడ్డారు.
Parthasarathi
YSRCP
Police

More Telugu News