రామ్ గోపాల్ వర్మపై విమర్శలు గుప్పించిన పూనమ్ కౌర్
- పవన్ ప్రసంగం అద్భుతమంటూ ట్వీట్ చేసిన వర్మ
- ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడతాడంటూ పూనమ్ ఫైర్
- సినిమా వాళ్లు రాజకీయ నాయకుల దగ్గర చేతులు జోడించడంపై ఆవేదన
'భీమ్లా నాయక్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతమంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ఆమె స్పందిస్తూ... ఒక దర్శకుడు మూల నుండి నవ్వుతూ, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా మాట్లాడతాడని... మరొక దర్శకుడు రాజకీయంగా ఆయనను కించపరుస్తూ ట్విట్టర్లో నవ్వుతాడని విమర్శించారు.