Hamsa Nandini: ‘కీమో’ నుంచి బయటపడ్డా.. ఇక సర్జరీలను తట్టుకోవాలి: హంసా నందిని

Hamsa Nandini opens up about cancer I am officially a chemo survivor
  • 16 సైకిల్స్ కీమో ఇచ్చారు
  • కీమో చికిత్స ముగిసింది
  • ఇక సర్జరీల వంతు
  • ఇన్ స్టాగ్రామ్ లో ఆసుపత్రిలోని ఫొటో షేర్
తెలుగు సినిమా కథానాయిక హంసా నందిని తాను బ్రెస్ట్ కేన్సర్ బారిన పడినట్టు ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. తన తాజా పరిస్థితి గురించి ఆమె ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తాను కీమో థెరపీని ఎట్టకేలకు గట్టెక్కినట్టు ప్రకటించింది.

‘‘16 సైకిల్స్ కీమో థెరపీ చేశారు. నేను ఇప్పుడు అధికారికంగా కీమో నుంచి కోలుకున్నాను. కానీ, చికిత్స ఇంకా పూర్తి కాలేదు. తదుపరి పోరాటానికి సన్నద్ధం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది’’అంటూ హంసా నందిని పేర్కొంది. ఆ పక్కనే ఆసుపత్రిలోని ఫొటో పోస్ట్ చేసింది.

తలపై వెంట్రుకలు పూర్తిగా తొలగించిన ఫొటోను 2021 డిసెంబర్ లో షేర్ చేస్తూ తాను కేన్సర్ బారిన పడినట్టు హంసా నందిని ప్రకటించింది. హంసా నందిని అమ్మ కూడా బ్రెస్ట్ కేన్సర్ తోనే మరణించారు. అదే మహమ్మారి హంసాకూ సోకింది. చిరునవ్వుతో పోరాడతాను, విజయం సాధిస్తానంటూ ఆమె లోగడ ప్రకటించడం సానుకూల ధోరణిని తెలియజేస్తోంది.
Hamsa Nandini
cancer
chemotherapy
instagram

More Telugu News