Russia: మీరు కనీవినీ ఎరుగని రీతిలో మీపై దాడులు చేస్తాం.. ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు పుతిన్ వార్నింగ్

Putin Warns Those Countries Stand By Ukraine Side
  • దాని పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయి
  • మా మధ్యలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నించవద్దు
  • ఉక్రెయిన్ ను ఆక్రమించాలన్నది తమ ఉద్దేశం కాదన్న పుతిన్
ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో.. ఆ దేశానికి మద్దతుగా నిలిచే దేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బెదిరింపులకు దిగారు. ఉక్రెయిన్ విషయంలో వకాల్తా పుచ్చుకోవాలనుకునే దేశాలు తాను చెప్పే చాలా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

‘‘ఎవరైనా మా ఘర్షణల విషయంలో జోక్యం చేసుకోవాలని చూసినా, మా దేశాన్ని బెదిరించినా, మా ప్రజల భద్రతకు విఘాతం కలిగించినా.. మేం వెనువెంటనే బదులిస్తాం. మేము ఇచ్చే బదులు ఎలా ఉంటుందంటే.. మీ జీవితంలో అలాంటి తీవ్రమైన పరిణామాలను కనీవినీ ఎరిగి ఉండరు. దీనికి సంబంధించి మేం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అందుకు అనుగుణంగా అన్ని చర్యలూ తీసుకున్నాం. కాబట్టి అందరూ నా మాట వింటారని అనుకుంటున్నా’’ అంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

ఉక్రెయిన్ ను ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేదని, ఇప్పటి రక్తపాతానికి ఆ దేశ ప్రభుత్వాలే కారణమని ఆయన తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ లో డీ మిలటరైజేషన్ (నిస్సైనీకరణ) కోసమే తన ప్రయత్నమని, అక్కడి సైనికులంతా ఆయుధాలు పడేసి ఇంటికెళ్లిపోవాలని సూచించారు.
Russia
Vladimir Putin
Ukraine

More Telugu News