Ukraine: యుద్ధం వేళ ఉక్రెయిన్ నుంచి న్యూఢిల్లీ చేరుకున్న భారతీయులు

A special flight from Ukraine comprising Indian nationals including students lands in Delhi
  • ప్ర‌త్యేక విమానం పంపిన భార‌త్
  • ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు వ‌చ్చిన కొంద‌రు భార‌తీయులు
  • ఎయిర్‌పోర్టులో బంధువుల స్వాగ‌తం
ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఉక్రెయిన్ లోని భార‌తీయుల‌ను వెంట‌నే స్వ‌దేశానికి రావాల‌ని ఇటీవ‌ల భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ప్ర‌త్యేక విమానాన్ని కూడా పంపించింది. దీంతో ప‌లువురు భార‌తీయులు భార‌త ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఉక్రెయిన్ నుంచి భార‌త్ వ‌చ్చారు.

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి విద్యార్థులు స‌హా ప‌లువురు భార‌తీయులు చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడి ప్రారంభించిన విష‌యం తెలిసిందే. స‌రైన స‌మ‌యంలో వారు భార‌త్ చేరుకోవడంతో వారిని బంధువులు ఆలింగ‌నం చేసుకుంటూ స్వాగ‌తం ప‌లికారు. కాగా, ఇప్ప‌టికీ ఉక్రెయిన్‌లోనే చాలా మంది భార‌తీయులు ఉన్నారు.
Ukraine
India

More Telugu News