Russia: రష్యాపై ఆగ్రహం.. సైన్యాన్ని పంపిస్తున్న కెనడా!

Canada to send army to Europe
  • రష్యాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న పలు దేశాలు
  • ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపిన కెనడా
  • రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేస్తామన్న కెనడా ప్రధాని
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్ కు మద్దతుగా కొన్ని దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతూ ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కెనడా కూడా రంగంలోకి దిగింది. రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది.

అంతేకాదు, తూర్పు ఐరోపా ప్రాంతంలోకి నాటో బలగాలకు దన్నుగా వందలాది సైనిక బలగాలను పంపిస్తున్నట్టు వెల్లడించింది. లాత్వియా సహా పరిసర ప్రాంతాల్లోకి 460 మంది సభ్యులతో కూడిన సాయుధ బలగాలను పంపుతున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు మిత్ర దేశాలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Russia
Ukraine
Canada
Army

More Telugu News