Samantha: ‘నీతో పిల్లల్ని కనాలని ఉంది’ అంటూ నెటిజన్ కామెంట్.. గట్టిగా బుద్ధి చెప్పిన సమంత

Samantha Strong Reply To Netizen Who Commented Objectionable Words
  • అభిమానులతో సరదా చాటింగ్
  • ఓ నెటిజన్ అసభ్యకర వ్యాఖ్యలు
  • అసలు ‘రీప్రొడ్యూస్’ను ఎలా వాడాలో తెలుసా అంటూ సమంత మండిపాటు
ఇటీవలి కాలంలో సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే అభిమానులతో ఆమె లైవ్ సెషన్ ను నిర్వహించింది. వారడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. అయితే, ఓ నెటిజన్ ఇదే అదనుగా తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అభ్యంతరకరమైన ప్రశ్నను సంధించాడు.

‘‘నువ్వు పిల్లల్ని కన్నావా? నేను నీతో పిల్లల్ని కనాలనుకుంటున్నాను (హ్యావ్ యూ రీప్రొడ్యూస్డ్, కాజ్ ఐ వాన్నా రొప్రొడ్యూస్ యూ)’’ అంటూ కామెంట్ చేశాడు. దానికి స్పందించిన ఆమె.. ‘‘ముందు ‘రీప్రొడ్యూస్’ను వాక్యంలో ఎలా వాడాలో తెలుసుకో. గూగుల్ లో వెతుకు’’ అంటూ గట్టిగా బుద్ధి చెప్పింది. కాగా, ప్రస్తుతం ఆమె గుణశేఖర్ డైరెక్షన్ లో ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తోంది.

Samantha
Tollywood

More Telugu News