'స్పిరిట్' కంటే ముందుగా 'రాజా డీలక్స్'ను లైన్లో పెట్టిన ప్రభాస్?
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'రాధే శ్యామ్'
- షూటింగు దశలో 'ప్రాజెక్టు K'
- సూపర్ హీరోగా కనిపించనున్న ప్రభాస్
- త్వరలో సెట్స్ పైకి 'రాజా డీలక్స్'
ఆ తరువాత ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేయవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కంటే ముందుగా ఆయన మారుతి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మారుతి 'రాజా డీలక్స్' సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మారుతి కూడా ఈ వార్తలను ఖండించలేదు.
ఇప్పుడు ఈ సినిమా కోసం చాలా ఫాస్టుగా సెట్స్ నిర్మాణం జరుగుతోందని చెబుతున్నారు. చాలా వరకూ ఈ సెట్స్ లోనే షూటింగు జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, పెద్దగా గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలానే ఉంది మరి.