Pavan Kalyan: పవన్ సినిమాకు ఈసారి ఓకే చెప్పిన పూజ హెగ్డే!

Bhavadeeyudu Bhagath Singh movie update
  • పూజ హెగ్డేకి ఫుల్ డిమాండ్
  • 'వకీల్ సాబ్'ను వద్దనుకుందట
  • 'వీరమల్లు'కు కూడా నో చెప్పిందట
  • 'భవదీయుడు భగత్ సింగ్'కి మాత్రం ఓకే!

టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం స్టార్ హీరోయిన్లంతా పోటీపడుతుంటారు. ఇక కొత్త కథానాయికలకు అది ఒక కలగా ఉంటుంది. అలాంటి పవన్ సరసన నటించే ఛాన్స్ ను పూజ హెగ్డే రెండుసార్లు వదులుకుందట.

'వకీల్ సాబ్' సినిమాలో శ్రుతి హాసన్ పోషించిన పాత్ర కోసం ముందుగా ఈ బ్యూటీనే అడిగారట. అయితే ఆ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోవడం .. నిడివి తక్కువగా ఉండటం వలన తాను చేయలేనని చెప్పిందట. ఇక ఆ తరువాత 'హరి హర వీరమల్లు' సినిమా కోసం కూడా పూజ హెగ్డేను సంప్రదించారట.

ఇది 100 కోట్ల బడ్జెట్ సినిమా .. చారిత్రక నేపథ్యంలో నడిచే కథ. అయినప్పటికీ ఆ పాత్ర తన క్రేజ్ కి తగినట్టుగా లేదనే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. అదే 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా విషయానికి వచ్చేసరికి, తన పాత్ర నచ్చడంతో రెండో ఆలోచన చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. మూడో సారికి గాని ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదన్న మాట.

  • Loading...

More Telugu News