Pulivendula: పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి.. ఖరారు చేసిన చంద్రబాబు

Btech Ravi would contest in  Pulivendula as tdp candidate in next elections
  • పులివెందుల నియోజకవర్గ నాయకులతో సమీక్ష 
  • మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారని ప్రచారం
  • కొట్టిపడేసిన చంద్రబాబు
  • బీటెక్ రవికే టికెట్ అన్న అధినేత
వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీపడే అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గ నాయకులతో నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)ని ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి ఆయనే బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారన్న ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. సమీక్ష సమావేశంలో కొందరు నేతలు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే, అలాంటిదేమీ లేదని, పులివెందుల నుంచి బీటెక్ రవి మాత్రమే బరిలోకి దిగుతారని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎమ్మెల్సీ అయిన బీటెక్ రవి పులివెందుల ఇన్‌చార్జ్‌గానూ కొనసాగుతున్నారు.
Pulivendula
Telugudesam
Betch Ravi
Chandrababu

More Telugu News