Sukumar: సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి... త్వరలో పూర్తి వివరాలు

Sukumar to direct Megastar Chiranjeevi
  • విడుదలకు సిద్ధంగా ఉన్న చిరంజీవి ఆచార్య
  • మరో మూడు సినిమాలతో మెగాస్టార్ బిజీ
  • చిరంజీవిని ఆయన నివాసంలో కలిసిన సుక్కు
  • కలం నిజం కానుంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
పుష్ప ది రైజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మాంచి ఊపుమీదున్నారు. ఇవాళ ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. నా కల నిజం కానుంది అంటూ ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కోసం మెగాఫోన్ పట్టుకుంటున్నాను అని వెల్లడించారు. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాక ఆయన భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

కాగా, సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టు సినిమా కాదని, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం యాడ్ మాత్రమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Sukumar
Chiranjeevi
New Project
Tollywood

More Telugu News