kuppam: కుప్పం ద్ర‌విడ వ‌ర్సిటీలో ఫుడ్ పాయిజ‌న్‌

Food Poison at Kuppam Dravida University
  • అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థినీలు 
  • 17 మంది ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లింపు
  • అక్క మ‌హాదేవీ హాస్ట‌ల్‌లో ఘ‌ట‌న‌
చిత్తూరు జిల్లా ప‌రిధిలోని కుప్పం ద్ర‌విడ వ‌ర్సిటీలో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం ప‌రిధిలోనే ద్ర‌విడ వ‌ర్సిటీ ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్సిటీలోని అక్క మ‌హాదేవి హాస్ట‌ల్ లో ఉంటున్న విద్యార్థినీలు తీసుకున్న ఆహారం విష‌తుల్యంగా మారింది.

దీంతో ఈ ఆహారం తీసుకున్న వారిలో 30 మంది విద్యార్థినీలు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని వర్సిటీ అధికారులు హుటాహుటీన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఆరోగ్యం విష‌మంగా ఉన్న 17 మంది విద్యార్థినీల‌ను ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు స‌మాచారం.
kuppam
darvida versity
chittoor district

More Telugu News