Bandi Sanjay: కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారు: బండి సంజయ్

Bandi Sanjay says more pressure on KCR at home
  • కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైందన్న సంజయ్
  • ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యలు
  • అందుకే జాతీయ రాజకీయాలు అంటున్నారని కామెంట్ 
  •  రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైందంటూ రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను సీఎం చేయాలంటూ కేసీఆర్ పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని బండి సంజయ్ విమర్శించారు.

గతంలో చంద్రబాబు కూడా ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగారని, ఆఖరికి ఆయనకు టెంటు కూడా లేకుండా పోయిందని, కేసీఆర్ పరిస్థితి కూడా అంతేనని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పనైపోయిందని, అందుకే బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay
KCR
KTR
CM
Telangana

More Telugu News