Mekapati Goutham Reddy: గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐతో విచార‌ణ చేయించాలి: టీడీపీ నేత బండారు స‌త్య‌నారాయ‌ణ

TDP leader Bandaru Satyanarayana demands probe into Gautam Reddys death with CBI
  • గౌత‌మ్ రెడ్డి మృతిపై అనుమానాలున్నాయ‌ని ప్ర‌క‌ట‌న‌
  • అనుమానాల నివృత్తికే సీబీఐ విచార‌ణ చేయాల‌ని డిమాండ్‌
  • రేపు ఉద‌య‌గిరిలో గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు
ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మృతిపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గౌత‌మ్ రెడ్డి మృతిపై ప‌లు అనుమానాలు ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే.. గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని బండారు డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. గుండెపోటు కార‌ణంగా సోమ‌వారం ఉద‌యం హ‌ఠాన్మ‌ర‌ణం పొందిన గౌత‌మ్ రెడ్డి పార్ధివ దేహాన్ని ఈరోజు ఉద‌యం నెల్లూరు త‌ర‌లించారు. నేటి రాత్రికి అమెరికాలో ఉంటున్న గౌత‌మ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. బుధ‌వారం ఉద‌యం గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలోని మెరిట్స్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో జ‌ర‌గ‌నున్నాయి.
Mekapati Goutham Reddy
bandaru satyanarayana
CBI

More Telugu News