ఏపీలో మరో 244 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో గడచిన 24 గంటల్లో 18,803 కరోనా పరీక్షలు నిర్వహించగా, 244 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 47 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 42, గుంటూరు జిల్లాలో 33 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 662 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,711 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,96,430 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 5,565 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,716కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Update
Today Cases

More Telugu News