YS Sharmila: తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు?: కేటీఆర్ పై షర్మిల ఫైర్

How can Telangana will be merged in AP asks YS Sharmila
  • తెలంగాణను ఏపీలో కలిపే కుట్ర జరుగుతోందన్న కేటీఆర్
  • జనాలను రెచ్చగొట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న షర్మిల
  • ఇది బంగారు తెలంగాణ కాదు.. బానిసత్వపు తెలంగాణ అని విమర్శ
బంగారు తెలంగాణను సాధించామని, ఇక బంగారు భారతదేశాన్ని సాధిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇది బంగారు తెలంగాణ కాదని... బానిసత్వపు తెలంగాణ అని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణలో 66 లక్షల మంది రైతులు ఉంటే... కేవలం 41 లక్షల మందికి మాత్రమే బీమాను వర్తింపజేస్తున్నారని విమర్శించారు. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమాను ఎందుకు వర్తింపజేయడం లేదని... 59 ఏళ్లలోపే రైతులు చనిపోవాలని కేసీఆర్ ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు.

రైతులందరికీ బీమా వర్తింపజేయాలని హైకోర్టును తాము ఆశ్రయించామని... ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేందుకు కుట్ర జరుగుతోందని మంత్రి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. తెలంగాణను మళ్లీ ఏపీలో కలపడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే విలీనం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.
YS Sharmila
YSRTP
KCR
KTR
TRS

More Telugu News