ఆన్ లైన్ క్లాసుల సంగతి తర్వాత... ముందు ఉక్రెయిన్ విడిచి వెళ్లిపోండి: విద్యార్థులకు మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
- ఉక్రెయిన్ పై యుద్ధ మేఘాలు
- సరిహద్దుల్లో మోహరించిన రష్యా
- యూనివర్సిటీల నుంచి ప్రకటన కోసం వేచిచూస్తున్న విద్యార్థులు
- స్పందించిన భారత ఎంబసీ
"మెడికల్ యూనివర్సిటీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేది, లేనిదీ తెలియడంలేదంటూ నిత్యం కీవ్ నగరంలోని భారత ఎంబసీకి విద్యార్థుల నుంచి లెక్కకు మిక్కిలిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయంలో భారత దౌత్య కార్యాలయం ముందే అప్రమత్తమైంది. సంబంధిత విద్యాసంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ఆన్ లైన్ క్లాసులపై సమాచారం వచ్చేంత వరకు విద్యార్థులు ఉక్రెయిన్ లోనే ఉండడం వారి క్షేమం దృష్ట్యా ఏమంత మంచిది కాదు. తాత్కాలికంగా ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోవడమే మంచిది. మెడికల్ యూనివర్సిటీల నుంచి ఏదైనా సమాచారం వస్తే వెంటనే తెలియపరుస్తాం" అంటూ కీవ్ లోని భారత దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.