Mekapati Goutham Reddy: ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో హైద‌రాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకున్న గౌతమ్‌రెడ్డి పార్థివ దేహం

nellore leaders expresses condolences
  • నెల్లూరు క్యాంపు కార్యాలయంలో గౌతమ్‌రెడ్డి పార్థివ దేహం
  • అమెరికా నుంచి బ‌య‌లుదేరిన‌ గౌతమ్‌రెడ్డి కుమారుడు
  • రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఉదయగిరిలో అంత్య‌క్రియ‌లు
నిన్న మరణించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి పార్థివ దేహాన్ని హైద‌రాబాద్, బేగంపేట విమానాశ్రయం నుంచి ఆర్మీ హెలికాప్ట‌ర్‌లో నెల్లూరుకు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజల సందర్శనార్థం నెల్లూరు క్యాంపు కార్యాలయంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు.

మరోపక్క, అమెరికా నుంచి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి బ‌య‌లుదేరారు. ఈ రోజు సాయంత్రం ఆయ‌న నెల్లూరుకు చేరుకునే అవ‌కాశం ఉంది.

రేపు ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వ‌హిస్తారు. ఉదయగిరిలో మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అంత్యక్రియలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, గౌతమ్‌రెడ్డి పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.
Mekapati Goutham Reddy
Andhra Pradesh
Nellore District

More Telugu News