Chandrababu: జగన్ కు ఇచ్చిన మొదటి చాన్సే చివరి చాన్స్!: చంద్రబాబు

Chandrababu held meeting wtih party leaders
  • అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశం
  • సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు
  • తల్లికి, చెల్లికి న్యాయం చేయలేకపోయారని విమర్శలు
  • ఇక రాష్ట్రానికేం చేస్తారని వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ కు ఇచ్చిన మొదటి చాన్సే చివరి చాన్స్ అని స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.

జగన్ తన తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారని ఘాటు విమర్శలు చేశారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివారు రాష్ట్రానికేం చేస్తారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పనిచేయని నేతలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. త్వరలోనే ఆన్ లైన్ సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
TDP
YSRCP

More Telugu News