Praggnanandhaa: వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్ సన్ ను కంగుతినిపించిన భారత చిచ్చరపిడుగు

Indian grand master Praggnanandhaa beats world number one Magnus Karlsen
  • ఎయిర్ థింట్స్ చెస్ టోర్నీలో సంచలనం
  • కార్ల్ సన్ కు ఓటమి రుచిచూపిన ప్రజ్ఞానంద
  • 39 ఎత్తుల్లో గేమ్ ముగించిన భారత టీనేజర్
  • ప్రజ్ఞానంద వయసు 16 ఏళ్లు
భారత టీనేజి గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద ప్రపంచ చదరంగ చరిత్రలో అద్భుత విజయం నమోదు చేశాడు. కొరకరానికొయ్యలాంటి వరల్డ్ నెంబర్ వన్ చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్ సన్ ను 16 ఏళ్ల ప్రజ్ఞానంద కంగుతినిపించాడు. ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ చెస్ చోర్నీలో ప్రజ్ఞానంద 8వ రౌండు పోరులో కార్ల్ సన్ ను ఓడించాడు. ఇది ఆన్ లైన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్. నల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లోనే నార్వే దిగ్గజం కార్ల్ సన్ ఆటకట్టించాడు. ఈ గేములో ప్రజ్ఞానంద తరాష్ వేరియేషన్ ను ఎంచుకున్నాడు.

మూడు వరుస విజయాలతో ఊపుమీదున్న కార్ల్ సన్ ఈ పోరులో గెలవడం నల్లేరుపై నడకేనని చెస్ పండితులు అంచనా వేశారు. అయితే, భారత టీనేజర్ ప్రజ్ఞానంద అమోఘమైన మేధాశక్తితో కార్ల్ సన్ జోరుకు కళ్లెం వేశాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద 8 రౌండ్ల అనంతరం 8 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు.
Praggnanandhaa
Magnus Karlsen
Chess
World Number.1
India
Grand Master

More Telugu News