Andhra Pradesh: ఎల్లుండి ఏపీలో మంత్రి మేక‌పాటి అంత్య‌క్రియ‌లు.. 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఏపీ స‌ర్కారు

ap govt expresses condolences
  • ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో పార్థివ దేహం
  • సాయంత్రం వ‌ర‌కు అభిమానుల‌ సంద‌ర్శ‌నార్థం అక్క‌డే
  • ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఎల్లుండి బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలో అంత్య‌క్రియ‌లు
ఏపీ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పార్థివ దేహాన్ని ఇప్ప‌టికే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు. ఈ రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్‌లోని నివాసంలోనే ఆయ‌న పార్థివ దేహాన్ని అభిమానులు, నేత‌ల‌ సంద‌ర్శ‌నార్థం ఉంచుతారు. అనంత‌రం ఆయ‌న మృత‌దేహాన్ని ఏపీలోని నెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకెళ్తారు.

అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఎల్లుండి బ్రాహ్మణపల్లిలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వ‌హిస్తారు. కాగా, ఏపీ ప్ర‌భుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
Andhra Pradesh
Mekapati Goutham Reddy

More Telugu News