Venkaiah Naidu: నేనంటే మేక‌పాటి గౌతమ్‌రెడ్డి ఎంతో అభిమానం చూపేవారు: వెంక‌య్యనాయుడు

venkaiah expresses condolences
  • గౌతమ్‌రెడ్డి  పరమపదించడం అత్యంత విచారకరం
  • వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు
  • నిబద్ధ‌త కలిగిన నాయకులు
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల ఉపరాష్ట్రప‌తి వెంక‌య్యనాయుడు సంతాపం తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు' అని వెంక‌య్యనాయుడు పేర్కొన్నారు.

'శ్రీ గౌతమ్‌రెడ్డి తాత గారి సమయం నుంచి వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. అలాంటి వ్యక్తి చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని వెంక‌య్యనాయుడు ట్వీట్ చేశారు.
Venkaiah Naidu
Mekapati Goutham Reddy
YSRCP

More Telugu News