CM Jagan: విశాఖ చేరుకున్న సీఎం జగన్... ఐఎన్ఎస్ డేగాకు పయనం

CM Jagan arrives Visakha to welcome president of India
  • విశాఖలో రేపు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ
  • ఈ సాయంత్రం నగరానికి రాష్ట్రపతి
  • కోవింద్ కు స్వాగతం పలకనున్న సీఎం జగన్
ఈ మధ్యాహ్నం వరకు కడప జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్, నేటి సాయంత్రం విశాఖ జిల్లాలో పర్యటనకు విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన, ఐఎన్ఎస్ డేగా వద్దకు పయనమయ్యారు. విశాఖలో రేపు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం జరగనుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ సాయంత్రం నగరానికి రానున్నారు. రాష్ట్రపతికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అనంతరం గన్నవరం తిరుగుపయనమవుతారు.

అంతకుముందు, విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్ కు మంత్రి అవంతి శ్రీనివాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి స్వాగతం పలికారు.
CM Jagan
Visakhapatnam
INS Dega
PFR
President Of India
Ram Nath Kovind

More Telugu News