ఇంకా అనేకమంది ప్రాంతీయ నేతలను కలుస్తా: సీఎం కేసీఆర్
- ముగిసిన కేసీఆర్, థాకరే సమావేశం
- సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు
- అనేక అంశాలపై లోతుగా చర్చించామన్న కేసీఆర్
- దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని వెల్లడి
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉందని, తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలని తెలిపారు. హైదరాబాద్ రావాలని సీఎం ఉద్ధవ్ థాకరేను కోరుతున్నానని అన్నారు. రెండు రాష్ట్రాలు అనేక అంశాల్లో కలిసి పనిచేయాల్సి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. దేశంలో మరిన్ని మార్పులు రావాల్సి ఉందని అభిలషించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు మారాల్సిందేనని స్పష్టం చేశారు.
కాగా, సీఎం ఉద్ధవ్ థాకరేతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ఉద్ఘాటించారు.