KCR: ముంబైలో కేసీఆర్, క‌విత‌ పోస్ట‌ర్లు.. ఫొటోలు వైర‌ల్

Posters welcoming Telangana CM K Chandrasekhar Rao to Maharashtra seen at various places in Mumbai
  • దేశ రాజకీయాల్లో మార్పే ల‌క్ష్యంగా కేసీఆర్ ముంబై ప‌ర్య‌ట‌న‌
  • ఆహ్వానం ప‌లుకుతూ పోస్టర్లు
  • కాసేప‌ట్లో ఉద్ధవ్‌తో భేటీ
దేశ రాజకీయాల్లో మార్పే ల‌క్ష్యంగా కేంద్ర‌ సర్కారుపై పోరాడాల‌ని గళం విప్పుతున్న సీఎం కేసీఆర్ కాసేప‌ట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక‌రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సమావేశం కానున్నారు. దేశ రాజకీయాలతో పాటు కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయ‌న చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు. ముంబైలో కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో గులాబీ రంగులో ఆయ‌న పోస్ట‌ర్లు అక్క‌డ ద‌ర్శ‌న‌మిచ్చాయి. కేసీఆర్‌తో పాటు ఉద్ధ‌వ్ థాకరే, శ‌ర‌ద్ ప‌వార్ బొమ్మ‌ల‌ను కూడా వాటిపై ప్ర‌చురించారు. ప‌లు పోస్ట‌ర్ల‌లో కేసీఆర్‌తో క‌లిసి క‌ల్వ‌కుంట క‌విత కూడా ఉన్నారు.
                                
     
KCR
TRS
Maharashtra
Telangana

More Telugu News