Basavatarakam Cancer Hospital: ఐఐటీ హైదరాబాద్ తో చేతులు కలిపిన బసవతారకం ఆసుపత్రి... సరికొత్త అధ్యాయమన్న బాలకృష్ణ

Basavatarakam hospital and IIT Hyderabad signed MoU for new course
  • క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే కొత్త కోర్సు
  • రేడియేషన్ ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ
  • బసవతారకం ఆసుపత్రి, ఐఐటీ హైదరాబాద్ మధ్య అవగాహన
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన బాలకృష్ణ
వేలాదిమంది క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రి, ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాచరణ కోసం రెండు సంస్థలు ఓ అవగాహనకు వచ్చాయని తెలిపారు. కొత్త కోర్సు ప్రవేశపెట్టేందుకు జరిగిన ఒప్పందంపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ మూర్తి, బసవతారకం ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.సుబ్రమణేశ్వర్ సంతకాలు చేశారని బాలకృష్ణ వివరించారు.
Basavatarakam Cancer Hospital
IIT Hyderabad
MoU
Radiation Physics Masters Degree
Balakrishna

More Telugu News