Nagachaitanya: ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ తో చైతూ!

Chaitu in Kishore Thirumala
  • 'బంగార్రాజు'తో భారీ హిట్ కొట్టిన చైతూ
  • ముగింపు దశలో 'థ్యాంక్యూ'
  • కిశోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్ట్    

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా కిశోర్ తిరుమలకి మంచి పేరు ఉంది. ప్రేమకథలను ఫ్యామిలీ ఎమోషన్స్ కి ముడిపెడుతూ ప్రేక్షకులను మెప్పించడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆయన సినిమాలను ఇటు యూత్ .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఆయన తాజా చిత్రంగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఈ నెల 25వ తేదీన విడుదలవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో కిశోర్ తిరుమల బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తదుపరి సినిమా నాగచైతన్యతో ఉంటుందనే విషయం చెప్పాడు. విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నామని అన్నాడు.

నాగచైతన్యకి మొదటి నుంచి కూడా ప్రేమకథా చిత్రాలు బాగా కలిసొచ్చాయి. ఆ మధ్య వచ్చిన 'లవ్ స్టోరీ' సినిమాను అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఇటీవల వచ్చిన 'బంగార్రాజు' కూడా ఆయనకి హిట్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత సినిమాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన 'థ్యాంక్యూ' లైన్లోనే ఉంది.

  • Loading...

More Telugu News