Hyderabad: హైదరాబాద్‌లోని కస్తూర్బాగాంధీ ట్రస్టు నుంచి అర్ధరాత్రి పరారైన 14 మంది యువతులు

18 girls elope from kasturba gandhi trust in Hyderabad
  • నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 18 మంది యువతులు
  • బెంగాల్, మహారాష్ట్రకు చెందిన వారే ఎక్కువ
  • బాత్రూం కిటికీ ఊచలు తొలగించి పారిపోయిన వైనం
  • గాయపడి వెళ్లలేకపోయిన మరో యువతి
హైదరాబాద్ హైదర్షాకోట్‌లోని కస్తూర్బాగాంధీ స్మారక ట్రస్టు నుంచి గత అర్ధరాత్రి 14 మంది యువతులు పరారు కావడం కలకలం రేపుతోంది. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన 18 మందిని కస్తూర్బాగాంధీ ట్రస్టులో పూర్తి భద్రత మధ్య ఉంచారు. వీరిలో బెంగాల్, మహారాష్ట్రకు చెందిన యువతులు ఎక్కువమంది ఉన్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో వీరిలో 15 మంది యువతులు స్నానాల గది కిటికీకి ఉన్న ఊచలు తొలగించి పారిపోయేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో స్వల్పంగా గాయపడిన ఓ యువతి వారితో వెళ్లలేక అక్కడే ఉండిపోయింది. యువతులు పరారైన విషయాన్ని ఈ తెల్లవారుజామున గుర్తించిన ట్రస్టు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన యువతులను పట్టుకునేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశారు.
Hyderabad
Kasturba Gandhi Trust
Hydershakote

More Telugu News