: ఆమ్వే ఇండియా చైర్మన్, డైరెక్టర్లకు 14 రోజుల కస్టడీ
మోసం కేసులలో ఆమ్వే ఇండియా చైర్మన్ విలియం ఎస్ పింక్నే, డైరెక్టర్లు సంజయ్ మల్హోత్రా, అన్షు బుద్ధరాజ్ లను కేరళలోని వాయనాడ్ జిల్లా, కాల్ పెట్ట కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపింది. వీరిని నిన్న రాత్రి వాయనాడ్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆమ్వే గొలుసుకట్టు విధానంలో డైరెక్ట్ మార్కెటింగ్ సెల్లింగ్ కంపెనీగా ఉంది. రాష్ట్రంలోనూ ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కొన్నేళ్ల కిందట ప్రభుత్వం ఆమ్వే ఇండియాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలోని కొన్ని రాష్ట్రాలలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.