పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
- ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు
- ఒకే విడతలో 117 స్థానాలకు ఎన్నికలు
- ముగిసిన ప్రచార పర్వం
- ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన
పంజాబ్ లో ఆదివారం ఎన్నికలు జరగనుండగా, శుక్రవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. పీసీసీ చీఫ్ సిద్ధూ మాట్లాడుతూ, మరోసారి కాంగ్రెస్ గెలిస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. కాగా, ఈసారి పంజాబ్ లో త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ ఈ పర్యాయం బీజేపీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఎదుర్కోవాల్సి ఉంది.