AP Govt: ఏపీ సచివాలయంలో కరోనా ఆంక్షల ఎత్తివేత... ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt lifts corona measures to attend secretariat in physical

  • కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వ నిర్ణయం
  • కార్యాలయానికి రావడంపై ఆంక్షలు
  • ప్రస్తుతం ఏపీలో బాగా తగ్గిన కరోనా వ్యాప్తి
  • భౌతిక హాజరుపై ఆదేశాలు

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రబలంగా ఉన్న సమయంలో ఏపీ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి హాజరుకావడంపై సర్కారు ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మునుపటితో పోల్చితే కరోనా ఉద్ధృతి బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వర్తించాలని సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులు కూడా బయోమెట్రిక్ విధానం పాటించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సమావేశాలకు కూడా భౌతికంగా హాజరు కావాలని ఆదేశించారు. సీఎస్, మంత్రుల సమీక్షలకు కూడా అధికారులు భౌతికంగా హాజరు కావాలని వివరించారు.

AP Govt
AP Secretariat
Employees
Corona Measures
Physical Attendance
Corona Pandemic
  • Loading...

More Telugu News