Ram Charan: ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ... తల్లి జన్మదినం సందర్భంగా ఫొటో పంచుకున్న రామ్ చరణ్

Ram Charan shares adorable pic of his mother on her birthday
  • నేడు కొణిదెల సురేఖ పుట్టినరోజు
  • తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్
  • తల్లిలా తననెవ్వరూ అర్థం చేసుకోలేరని కామెంట్
మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో సురేఖకు చెరోవైపున చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్... "నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు... హ్యాపీ బర్త్ డే మా" అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు.
Ram Charan
Konidela Surekha
Birthday
Acharya
Chiranjeevi
Mega Family
Tollywood

More Telugu News