K Kavitha: కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

K Kavitha offers prayers to Tirumala Venkateshwara
  • కొండపైకి నడకమార్గం ద్వారా వెళ్లిన కవిత దంపతులు
  • శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్న కవిత
  • కవిత దంపతులకు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందించిన వేదపండితులు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి నిజపాద దర్శనం సేవలో ఆమె పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారి పట్టు వస్త్రాలను అందించారు. ఆమెతో పాటు భర్త అనిల్, కుటుంబసభ్యులు ఉన్నారు.

కాగా, కొండపైకి ఆమె నడకమార్గంలో చేరుకున్నారు. మరోవైపు తాము శ్రీవారిని దర్శించుకున్నట్టు కవిత ట్విట్టర్ ద్వారా తెలిపారు. నిజపాదసేవలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు. ఏడు కొండల స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకున్నానని అన్నారు. స్వామివారి దర్శనానంతరం ఆమె కొండపై ఉన్న లేపాక్షి బుక్ స్టాల్ ను సందర్శించారు.
K Kavitha
TRS
Tirumala

More Telugu News