Sathya Gaura Chandradas: సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం: సత్య గౌర చంద్రదాస్

Sathya Gaura Chandradas lauds CM Jagan
  • తాడేపల్లి మండలంలో గోకుల క్షేత్రం
  • భూమి కేటాయించిన సీఎం జగన్
  • రేపు ప్రారంభోత్సవం
  • హాజరుకానున్న ఏపీ సీఎం
హరేకృష్ణ మూవ్ మెంట్ ఇండియా ధార్మిక సంస్థ ఏపీలోని తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద భారీ గోకుల క్షేత్రం నిర్మిస్తోంది. ఈ గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమి కేటాయించడంపై హరే కృష్ణ మూవ్ మెంట్ రాష్ట్ర ఏడీఎం సత్య గౌర చంద్రదాస్ స్పందించారు.

గోకుల క్షేత్ర ఏర్పాటుకు సీఎం జగన్ భూమి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ గోకుల క్షేత్ర నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. సీఎం జగన్ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు తనవంతు కృషి చేస్తున్నారని సత్య గౌర చంద్రదాస్ కొనియాడారు. కాగా, గోకుల క్షేత్ర నిర్మాణం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Sathya Gaura Chandradas
CM Jagan
Gokula Kshetram
Kolanukonda
Tadepalli
Andhra Pradesh

More Telugu News