Pawan Kalyan: బన్నీ కన్నా పెద్దవాడినని పవన్ కల్యాణ్ నిరూపించుకునే చాన్స్ వచ్చింది: ఆర్జీవీ

Pawan Kalyan Now Can Prove He is Bigger Than Bunny Says RGV
  • హిందీలో భీమ్లా నాయక్ విడుదలపై స్పందన
  • పుష్ప కన్నా భీమ్లా నాయక్ పెద్దదని ప్రూవ్ చేయొచ్చని కామెంట్
  • ఏది పెద్ద సినిమా అవుతుందంటూ పోల్ పెట్టిన వైనం
అల్లు అర్జున్ కన్నా తానే పెద్దవాడినని నిరూపించుకునే చాన్స్ పవన్ కల్యాణ్ కు వచ్చిందని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ నెల 25న పవన్ కల్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ దానిపై స్పందించారు.

‘‘గ్రేట్.. మొత్తానికి భీమ్లా నాయక్ హిందీలో విడుదలవుతోంది. కాబట్టి తన సినిమా పుష్ప కన్నా చాలా పెద్దదని, తాను బన్నీ కన్నా పెద్దవాడినని నిరూపించుకునే చాన్స్ పవన్ కల్యాణ్ కు వచ్చిందిప్పుడు’’ అని ట్వీట్ చేశారు.

అంతేకాదు.. హిందీలో అల్లు అర్జున్ పుష్ప కన్నా.. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ పెద్ద సినిమాగా నిలుస్తుందా? అని పోల్ కూడా పెట్టారు. ఇప్పటిదాకా ఎస్ అని 47 శాతం మంది ఓటు వేస్తే.. 53 శాతం మంది నో అని ఓటేశారని వర్మ్ వెల్లడించారు. ఫలితం ప్రస్తుతం స్టడీగా ఉందని, రాబోయే 23 గంటల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని పేర్కొన్నారు.
Pawan Kalyan
Allu Arjun
Ram Gopal Varma
RGV

More Telugu News