Rashmika Mandanna: తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన‌ హీరోయిన్ ర‌ష్మిక

rashmika on marriage
  • అత‌డి ద‌గ్గ‌ర ఉంటే సుర‌క్షితంగా ఉన్న‌ట్లు భావించాలి
  • కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకునేలా ఉండాలి
  • అతడే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్
  • ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడే అది ప్రేమ‌ అవుతుందన్న రష్మిక 
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పింది హీరోయిన్ ర‌ష్మిక. ఆమె న‌టించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... ఎవరి దగ్గర ఉంటే మ‌నం సుర‌క్షితంగా ఉన్న‌ట్లు భావిస్తామో కంఫర్ట్‏గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ స్నేహంగా ఉంటామ‌ని అనిపిస్తుందో అతడే జీవితానికి మంచి లైఫ్ పార్టనర్ అని చెప్పింది.

తాను అలాంటి వ్య‌క్తినే భర్తగా ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. ఇరువురు సమానంగా అర్థం చేసుకున్నప్పుడే అది ప్రేమ‌ అవుతుందని తెలిపింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేనప్పుడు అది వన్ సైడ్ లవ్ గానే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఒకవేళ తాను ప్రేమ వివాహం చేసుకుంటే ఇంట్లో వారిని ఒప్పించే చేసుకుంటానని చెప్పింది. ఇక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఈ నెల‌ 25న విడుదల కానుంది.
Rashmika Mandanna
Tollywood

More Telugu News