Kishan Reddy: పీఎం మిత్రలో చేరండి: కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy asks KCR to join PM Mitra
  • పీఎం మిత్రలో చేరేందుకు ప్రతిపాదనలను పంపండి
  • వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు పీఎం మిత్ర ఉపయోగకరంగా ఉంటుంది
  • వచ్చే నెల 15వ తేదీ లోపల ప్రతిపాదనలను పంపించమన్న కేంద్రమంత్రి 
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 'పీఎం మిత్ర' పథకంలో చేరాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఈ పథకంలో చేరేందుకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలను పంపాలని కోరారు. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు పీఎం మిత్ర ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పీఎం మిత్రలో చేరాలంటూ గత నెల 15న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జౌళి, వస్త్ర పరిశ్రమ లేఖ రాసిందని ఆయన గుర్తు చేశారు. వచ్చే నెల 15వ తేదీ లోపల ప్రతిపాదనలను పంపించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Kishan Reddy
BJP
KCR
TRS

More Telugu News