Revanth Reddy: రేవంత్ రెడ్డికి పిండప్రదానం చేసిన టీఆర్ఎస్ ఐటీ సెల్

TRS IT cell performed pinda pradam to Revanth Reddy
  • కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన రేవంత్ కు పిండప్రదానం
  • రేవంత్ పిండాలను మూసీలో కలిపిన వైనం
  • రేవంత్ చంద్రబాబు పెంపుడు కుక్క అని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ ఫొటోతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తెలంగాణ ద్రోహి అని, టీడీపీ అధినేత చంద్రబాబు పెంపుడు కుక్క అని అన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పుట్టుకనే ప్రశ్నించిన బీజేపీని ఎదిరించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
Revanth Reddy
Congress
KCR
TRS

More Telugu News