Ajit Dovals: జాతీయ భద్రతా సలహాదారు నివాసం వద్ద దుశ్చర్య.. కారుతో దూసుకొచ్చిన ఆగంతుకుడు

Man in car tries to barge into NSA Ajit Dovals residence
  • అడ్డుకున్న భద్రతా సిబ్బంది
  • అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
  • శరీరంలో చిప్ ఉందంటూ హడావిడి
  • ఎంఆర్ఐ స్కాన్ లో లేదని వెల్లడి
ఢిల్లీలోని జాతీయ భద్రతా సలహారు అజిత్ ధోవల్ నివాసం వద్ద ఒక ఆగంతుకుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. కారుతో లోపలికి దూసుకుపోతుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నేటి ఉదయం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తన శరీరంలో చిప్ ఉందని, బయట నుంచి దాన్ని నియంత్రిస్తున్నారంటూ చెప్పి, భద్రతా సిబ్బందికి అతడు చెమటలు పట్టించాడు. కానీ, ఎంఆర్ఐ స్కాన్ చేయగా చిప్ లేదని తేలినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ప్రస్తుతం అతడ్ని విచారిస్తున్నారు. అతను బెంగళూరుకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
Ajit Dovals
NSA
residence
National Security Adviser
security breach

More Telugu News