Captain Amarinder Singh: రాహుల్ ఒక పిల్లోడు.. 50 ఏళ్లు వచ్చినంత మాత్రాన ఐన్ స్టీన్ కాలేడు: అమరీందర్ సింగ్ చురక

Captain Amarinder Singh says Rahul Gandhi needs to evolve as leader
  • రాహుల్, ప్రియాంక మాటలకు స్పందించను
  • వారు చెప్పేది చెప్పనివ్వండి
  • వారి నాన్న రాజీవ్ నాకు స్నేహితుడు
  • రాహుల్ రాజకీయ నేతగా ఎదగాల్సి ఉందన్న అమరీందర్ 
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని పిల్లలుగా ఆ పార్టీ మాజీ నేత, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ అభివర్ణించారు. పిల్లలు చెప్పే దానిని తాను పట్టించుకోనన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ నరేంద్ర మోదీ సర్కారు మార్గదర్శకంలో పనిచేశారని రాహుల్, ప్రియాంక చేసిన ఆరోపణలపై అమరీందర్ పై విధంగా స్పందించారు.

‘‘నాకు గొప్ప మనవలు ఉన్నారు. అయితే వారు నాకు ఏమవుతారు? నాకు పిల్లలతో సమానం. వారి తండ్రి నాకు స్నేహితుడు. 50 ఏళ్లు వచ్చినంత మాత్రాన.. ఆ వయసు రాహుల్ ను కానీ, ప్రియాంకను కానీ ఐన్ స్టీన్ (ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త)ను చేయలేదు. వారు సాధారణ రాజకీయవేత్తలు. కాలంతోపాటే వృద్ధి చెందాలి. కాలంతోపాటు అనుభవం సంపాదించాలి. రాహుల్ గాంధీ గురించి నేను చెప్పేది ఇదే. ఆయన రాజకీయ నేతగా ఇంకా ఎదగలేదు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను నడుచుకున్నానని చెప్పడం అసత్యం. అయితే పంజాబ్ కోసం నా డిమాండ్లను తీర్చినందుకు వారికి (మోదీ సర్కారు) నేను ఎంతో ధన్యుడను. పిల్లలు ఏం చెబుతారో చెప్పనివ్వండి. పంజాబ్ లో కాంగ్రెస్ 20 సీట్లను దాటితే అది గొప్పే అవుతుంది’’ అని అమరీందర్ అన్నారు.
Captain Amarinder Singh
Rahul Gandhi
Priyanka Gandhi
pubjab

More Telugu News