Chandrababu: చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోంది... సీఎస్ కు చంద్రబాబు లేఖ

Chandrababu shot a letter to AP CS over illegal mining in Chittoor district
  • గత నెలలో కుప్పంలో పర్యటించిన చంద్రబాబు
  • గనులను పరిశీలించినట్టు వెల్లడి
  • అక్రమ మైనింగ్ ను గుర్తించామని వివరణ
  • చర్యలు తీసుకోవాలని సీఎస్ కు లేఖ
చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. శాంతిపురం మండలం ముద్దనపల్లెలో గ్రానైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు.

అక్రమ మైనింగ్ పై గత నెలలో కుప్పంలో పర్యటించిన సందర్భంగా పరిశీలించినట్టు చంద్రబాబు తెలిపారు. మైనింగ్ అక్రమాలు నిజమేనని అధికారులు కూడా నిర్ధారించారని పేర్కొన్నారు. అయితే, తనిఖీల తర్వాత కూడా అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉందని వివరించారు. ఇందులో వైసీపీ నేతలు భాగస్వాములైనందు వల్లే చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు.
Chandrababu
Illegal Mining
Chittoor District
AP CS
YSRCP
Andhra Pradesh

More Telugu News