Manchu Vishnu: మా నాన్నను ప్రభుత్వం ఆహ్వానించింది.. కొందరు ఆహ్వానాన్ని నాన్నకు చేరనివ్వలేదు: మంచు విష్ణు

AP govt invited my father says Manchu Vishnu
  • సీఎం జగన్ తో ముగిసిన మంచు విష్ణు భేటీ
  • గతంలో సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి వెళ్లని మోహన్ బాబు
  • ఆయనకు ఆహ్వానం అందలేదని జరిగిన ప్రచారం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎంతో సినీ ప్రముఖులకు జరిగిన భేటీకి నాన్న గారికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని... అయితే, ఆ ఆహ్వానం నాన్నకు చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వాళ్లు ఎవరో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు చెపుతామని అన్నారు. సీఎంతో భేటీకి మోహన్ బాబు వెళ్లకపోవడంతో ఆయనకు ఆహ్వానం అందలేదనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దీనిపై విష్ణు క్లారిటీ ఇచ్చారు.
Manchu Vishnu
Tollywood
Mahesh Babu
jagan
YSRCP
Mohan Babu

More Telugu News