యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ముగిసిన పోలింగ్
- యూపీలో రెండో దశ పోలింగ్
- 60.69 శాతం ఓటింగ్ నమోదు
- గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు
- గోవాలో భారీ ఓటింగ్
అటు, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు ఒకే విడతలో పోలింగ్ చేపట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ముగిసింది. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 సీట్ల కోసం ఇవాళ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల సమయానికి 59.37 శాతం పోలింగ్ నమోదైంది.
గోవాలో భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఇక్కడ 75.29 శాతం పోలింగ్ నమోదైంది. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా, అన్నింటికి ఇవాళ పోలింగ్ చేపట్టారు.
ఇంకా, యూపీలో 5 దశల పోలింగ్ మిగిలుంది. మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కలిపి మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.