ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేత... సీఎం జగన్ ఆదేశాలు
- ఏపీలో తగ్గుతున్న కరోనా రోజువారీ కేసులు
- తాజాగా 434 కొత్త కేసులు
- పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్
- వివరాలు సీఎంకు నివేదించిన అధికారులు
- ఫీవర్ సర్వే ఆపొద్దన్న సీఎం జగన్
కాగా, ఏపీలో గత రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజా బులెటిన్ లో 434 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ లోనే కొత్త కేసులు వచ్చాయి. కేసులు తక్కువగా వస్తున్న అంశాన్ని అధికారులు నేటి సమీక్షలో సీఎం జగన్ కు వివరించారు.
దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగించాలని ఆదేశించారు. లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలు చేయించాలని సూచించారు.