Glenn Maxwell: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు భారత సంతతి అమ్మాయితో ఆస్ట్రేలియా క్రికెటర్ పెళ్లి

Aussies cricketer Glenn Maxwell set to tie the knot with Indian origin girl
  • మ్యాక్స్ వెల్ వెడ్స్ వినీ రామన్
  • తమిళంలో పెళ్లి కార్డు ముద్రణ  
  • మార్చి 27న హిందూ వివాహం
  • 2020లోనే నిశ్చితార్థం
ఆస్ట్రేలియా క్రికెటర్... భారత సంతతి అమ్మాయి... త్వరలోనే ఒక్కటవబోతున్నారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు... డాషింగ్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్. ఈ ఆసీస్ ఆటగాడి మనసు దోచిన అమ్మాయి పేరు వినీ రామన్. వినీ ఓ ఫార్మసిస్ట్. గతంలో మ్యాక్స్ వెల్ ఓసారి కెరీర్ లో ఒడిదుడుకుల కారణంగా డిప్రెషన్ కు లోనయ్యాడు. ఆ సమయంలో వినీ కౌన్సిలింగ్ తో మళ్లీ మామూలు మనిషయ్యాడు. ఆపై వీరి స్నేహం ప్రేమగా మారింది.

మ్యాక్స్ వెల్, వినీ శ్చితార్థం 2020లోనే జరిగినా, పెళ్లి కోసం ఇన్నాళ్లు ఆగారు. వీరు మార్చి 27న పెళ్లి చేసుకోబోతున్నారు. విశేషం ఏంటంటే, మ్యాక్స్ వెల్ క్రిస్టియన్ అయినప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవంతో హిందూ వివాహం చేసుకుంటున్నాడు. కాగా, వినీ రామన్ తమిళ అమ్మాయి కావడంతో, పెళ్లి కార్డును తమిళంలోనే ప్రింట్ చేయించారు. సోషల్ మీడియాలో వీరి పెళ్లి కార్డు వైరల్ అవుతోంది.
Glenn Maxwell
Vini Raman
Wedding
Cricket
Australia
India

More Telugu News